ఉదయగిరి నియోజకవర్గo లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆశావహులు.. కూటమి హవా ఖాయమంటున్న నేతలు
కలిగిరి, అక్టోబర్ 12 (మన ధ్యాస ప్రతినిధి నాగరాజు):

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం లోని 8 మండలాల లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి. నియోజకవర్గ లోని 8 మండలంలో గ్రామ పంచాయతీలలో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు అభ్యర్థులు ఇప్పటికే సిద్ధమవుతున్నారు. పంచాయతీ, ఎంపీటీసీ , జడ్పీటీసీ,ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. గ్రామాల్లో తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు.2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే కుప్పకూలిందని, ఆ ఫలితమే ప్రజల నాడి ఏమిటో చెప్పిందని కూటమి నేతలు అంటున్నారు. అదే స్ఫూర్తితో ఉదయగిరి నియోజకవర్గం లో 8 మండలాల లోని పంచాయతీలలో వైసీపీని పూర్తిగా ఓడించేందుకు కూటమి నేతలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో, ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తోందని నేతలు పేర్కొన్నారు.అభివృద్ధి చేయగల నాయకుడు కావాలనే ఉద్దేశంతోనే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కూటమికి పట్టం కట్టారని, అదేవిధంగా జరగబోయే స్థానిక ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వానిదే విజయమని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని వారు చెబుతున్నారు.మొత్తానికి ఉదయగిరి నియోజకవర్గం లో 8 మండలాల లో స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
