

మన న్యూస్:నిజాంసాగర్,ఎల్లారెడ్డి: మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలను మంగళవారం జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి దయానంద్ ,ఆర్ ఎల్ సి కిరణ్ గౌడ్ లు కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. సవరించిన మెను ప్రకారం ప్రతిరోజు భోజనం, స్నాక్స్, పండ్లు అందిoచాలని సూచించారు.విద్యార్థులు ఉపాధ్యాయులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. పాఠశాలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. హాస్టల్ కు సంబంధించిన రికార్డులు, విద్యార్థులు ఉపాధ్యాయుల రిజిస్టర్లు తనిఖీ చేశారు. ఇటీవల నిర్వహించిన సీఎం కప్ పోటీల్లో ప్రతిభ చాటి బహుమతులు సాధించిన విద్యార్థులను అభినందించారు పదవ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మహమ్మద్ రఫత్, ఎస్ఎల్ సి బాలరాజ్,తదితరులు ఉన్నారు.