తవనంపల్లె సెప్టెంబర్ 07 మన ద్యాస(నాగరాజ సరకింటి)
భార్యతో పరిచయం అడ్డుకోవడంతో కక్షపెంచుకున్న ఓ వ్యక్తి, తన స్నేహితుడితో కలిసి భర్తను హత్య చేయాలనే పథకంతో ఇనుప రాడ్లతో తలపై దాడి చేసిన ఘటన తవనంపల్లె మండలంలో కలకలం రేపింది. పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు పంపారు.తవనంపల్లె మండలం, చెర్లోపల్లి పంచాయతీ, ఉప్పొంక గ్రామానికి చెందిన పి. హేమచంద్ర (తండ్రి దివంగత పి. మునస్వామి) గత సెప్టెంబర్ 24, 2026 రాత్రి సుమారు 9 గంటలకు అరగొండ నుండి తన ఇంటికి మోటార్ సైకిల్ పై వస్తుండగా, వెంగంపల్లి మాదిగవాడకు చెందిన డి. మధు, వడ్డీవాని చెరువు గ్రామం, చెర్లోపల్లి పంచాయతీకి చెందిన వి. లక్ష్మీనారాయణ ఇద్దరూ కలిసి ఇనుప రాడ్లతో తల వెనుక భాగంలో, తలపైన బలంగా కొట్టారు.హేమచంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయంపై హేమచంద్ర అన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు తవనంపల్లె పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.ఈ కేసు ని విచారించిన ఎస్ఐ రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం
విచారణలో భాగంగా ఈ నెల 7వ తేదీ (07-10-2026) డి. మధు, వి. లక్ష్మీనారాయణలను అరెస్టు చేసి విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.డి. మధుకు హేమచంద్ర భార్య సుప్రియతో పరిచయం ఏర్పడి, సుమారు 3 సంవత్సరాల క్రితం నుండి తరచూ మాట్లాడుతూ సన్నిహితంగా ఉండేవారు. ఈ విషయంపై హేమచంద్ర, మధుల మధ్య గొడవలు జరిగి ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. తరువాత సుప్రియను మధుతో మాట్లాడవద్దని హేమచంద్ర చెప్పినందుకు కోపంతో, మధును చంపాలనే పథకం ప్రకారం డి. మధు తన స్నేహితుడు వి. లక్ష్మీనారాయణతో కలిసి ఇనుప రాడ్లతో తలపై బలంగా కొట్టారని ఒప్పుకున్నారని ఇద్దరు నిందితులను ఈ దినం హత్యా ప్రయత్నం కేసుపై రిమాండుకు పంపినట్లు ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *