తిరుపతి పాత రేణిగుంట రోడ్డులోని శ్రీ అంకాళమ్మ దేవస్థానంలో జరగనున్న శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాల ఆహ్వాన పత్రికను ఆలయ ప్రతినిధులు, నిర్వాహకులు తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి కి మర్యాదపూర్వకంగా అందజేసి ఆహ్వానించారు.
ఈ మహోత్సవాలకు భక్తులందరూ విశేష సంఖ్యలో పాల్గొని, అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు.
ఆహ్వానాన్ని స్వీకరించిన తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఉత్సవాలు ఘనంగా విజయవంతం కావాలని ఆకాంక్షించారు
