​ రేణిగుంట : మద్యం మత్తులో కారు నడుపుతూ పట్టుబడి కోర్టులో నేరాన్ని అంగీకరించిన వెంకటగోపాలపురం గ్రామానికి చెందిన A. మునికృష్ణ (34, తండ్రి: A. కుమార్) అనే వ్యక్తికి తిరుపతి II స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (2వ క్లాస్) కోర్టు వినూత్నమైన శిక్ష విధించింది. న్యాయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, కొత్తగా వచ్చిన బి ఎన్ ఎస్ ఎస్ సెక్షన్ 23 ప్రకారం నిందితుడికి 10 రోజుల పాటు ఉచితంగా సామాజిక సేవ (కమ్యూనిటీ సర్వీస్) చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా నిందితుడు అక్టోబర్ 7 నుంచి నుండి అక్టోబర్ 16 వరకు రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ మరియు రేణిగుంట ప్రభుత్వ ఆసుపత్రి పరిసర ప్రాంతాలను శుభ్రపరిచి, పరిశుభ్రతను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పనులను రేణిగుంట ఎస్ హెచ్ ఓ స్వయంగా పర్యవేక్షించి, నిందితుడు పనులు పూర్తి చేసినట్లు ధృవీకరించే ఫోటోలతో కూడిన కంప్లయన్స్ రిపోర్టును అక్టోబర్ 17 ఉదయం 10:30 గంటలలోపు కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. ఒకవేళ ఆదేశాలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన న్యాయస్థానం, చిన్న నేరాలకు జైలు శిక్ష బదులు సామాజిక సేవ విధించి బాధ్యత పెంచేలా ఈ ఆదర్శవంతమైన తీర్పును వెలువరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *