హైదరాబాద్ నుండి ఇండిగో విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆర్చరీ క్రీడాకారుడు తిరుమూర్ గణేష్ మణిరత్నం కు ఘన స్వాగతం లభించింది. ఇటీవల జరిగిన 20వ ఏషియన్ గేమ్స్‌ లో ఆర్చరీ విభాగంలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన ఆయన, ఇండి విజ్యువల్ విభాగంలో కాంస్య పతకం మరియు టీమ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించారు.
ఈ సందర్భంగా గణేష్ మణికంఠన్ మాట్లాడుతూ… దేశం తరఫున ఆడి పతకాలు సాధించడం చాలా గర్వంగా ఉందన్నారు. తనకు ఘన స్వాగతం పలికి, ఎంతగానో ప్రోత్సహించిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శాప్ చైర్మన్ రవి నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విమానాశ్రయం నుండి ఆయన రోడ్డు మార్గం గుండా తిరుపతికి బయలుదేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *