ఉత్తమ పౌరులుగా విద్యార్థులను మలచడంలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిది

పాఠశాలలు, ఉపాధ్యాయులకు ఎల్లవేళలా అండగా ఉంటాం

తుడా ఛైర్మన్ డా డాలర్స్ దివాకర్ రెడ్డి.

ఘనంగా ‘అప్పుస్మా’ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం:

ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు పులివర్తి నాని ,ఆరణి శ్రీనివాసులు , కలికిరి మురళీమోహన్ ,ఏపీ గ్రీనరీ బ్యూటిఫికేషన్ ఛైర్మన్ సుగుణమ్మ ,టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి హాజరు. విద్యార్థులకు క్రమశిక్షణ, ఉన్నత లక్ష్యాలను నేర్పిస్తూ సమాజానికి ఉత్తమ పౌరులుగా అందించే మహోన్నత బాధ్యత ఉపాధ్యాయులదేనని తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్-ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ (అప్పుస్మా) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన “అప్పుస్మా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానోత్సవం” కార్యక్రమానికి ఆయన విశిష్ట అతిథిగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా డాక్టర్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ:చిన్నతనం నుంచి తల్లిదండ్రులు ఎంతగానో చూసుకున్నప్పటికీ, ఎలాంటి రక్తసంబంధం లేకపోయినా విద్యార్థులను కన్న బిడ్డల వలె భావించి వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనన్నారు.పాఠశాల దశలోనే విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఉన్నత ఆలోచనలు, భవిష్యత్ లక్ష్యాలను నూరిపోసి దేశానికి మంచి పౌరులుగా అందిస్తున్నారని ప్రశంసించారు. దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ మహిళలు, బాలికలు ముందంజలో ఉంటూ విశేష ప్రతిభ కనబరుస్తున్నారని, ఇందుకు పాఠశాలల్లో ఉపాధ్యాయులు నేర్పిన ఆత్మవిశ్వాసం, సంస్కారమే కారణమని తెలిపారు.తిరుపతి పుణ్యక్షేత్రంగానే కాకుండా ఒక ప్రముఖ విద్యా కేంద్రంగా కూడా గుర్తింపు పొందిందని, చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా నాణ్యమైన విద్య కోసం విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారన్నారు. తిరుపతి జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ విద్యార్థులను తయారు చేయడంలో ఉపాధ్యాయుల కృషి ఎనలేనిదని అన్నారు.విద్యా రంగానికి, పాఠశాలలకు, విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు ఏ అవసరం వచ్చినా తన వంతుగా ఎల్లవేళలా సంపూర్ణ సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న గురువులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, విద్యార్థులను భావి భారత నిర్మాతలుగా తీర్చిదిద్దడంలో మరింతగా కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డీఈవో కేవీవీ కుమార్, అప్పుస్మా నేతలు తులసి విష్ణు ప్రసాద్, డాక్టర్ విశ్వనాథ రెడ్డి, డాక్టర్ తమ్మినేని వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *