
అంతర్ జిల్లాల జంప్ రోప్ పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచిన 11 మంది విద్యార్థులు.
అన్నమయ్య జంప్ రోప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 8వ సబ్-జూనియర్ ఇంటర్-డిస్ట్రిక్ట్ జంప్ రోప్ ఛాంపియన్‌షిప్ – ఆంధ్రప్రదేశ్ పోటీల్లో రెయిన్‌బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
అండర్-12, అండర్-14 విభాగాల్లో 11 మంది విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుని నేషనల్స్‌కు ఎంపిక కావడం పట్ల పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.
జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులు
బాలికల విభాగం:
- దీప్తి హనీ కె. – 8వ తరగతి
- కీర్తి కె. – 8వ తరగతి
- కారుణ్య ఎస్. – 7వ తరగతి
- దీపాన్విత కె. – 8వ తరగతి
- ప్రణవి కె. – 8వ తరగతి
- జ్ఞాపిక ఎన్. – 7వ తరగతి
బాలుర విభాగం:
- కె.ఎం.డి. రిహాన్ – 9వ తరగతి
- దీక్షిత్ కుమార్ – 8వ తరగతి
- ఎస్. ముస్తఫా – 7వ తరగతి
- ఎండి. ఖదీర్ – 8వ తరగతి
- బి. ఎస్లినక్షత్ర – 8వ తరగతి
ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండంట్ పి.ఎ. ఖాన్ మాట్లాడుతూ, విద్యార్థులను అంకితభావంతో శిక్షణ ఇచ్చిన కోచ్ రెడ్డి కి, అలాగే విద్యార్థుల క్రీడా ప్రతిభను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.
జాతీయ స్థాయి పోటీల్లోనూ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రెయిన్‌బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్‌కు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
