రేణిగుంట పట్టణంలోని జి ఎం స్ట్రీట్ లో శ్రీ అభయ వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి మహోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి 31 అడుగుల మట్టి వినాయకుడు నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. ముందు రోజు రాత్రి సాంసృతిక కార్యక్రమలలో పాల్గొన్న చిన్నారులకు, కమిటీ సభ్యులు, టీడీపీ పట్టణ అధ్యక్షులు మహబూబ్ బాషా, డాన్స్ మాస్టర్ శివ చేతుల మీదుగా పాల్గొన్న ప్రతి ఒక్కరిని సన్మానిచ్చి మేమేంటోలను అందించారు. ఆదివారం మధ్యాహ్నం సుమన్ వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో సుమారు మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం స్థానిక యువకులు ఉట్టి కొట్టె కార్యక్రమం నిర్వహించారు. 6 గంటలకు స్థానిక సాయిబాబా మందిరం నుంచి మహిళలు 108 బిందెలతో పాలను ఊరేగింపుగా తీసుకొని వచ్చి స్వామివారికి పాలాభిషేకం చేశారు. విఘ్నేశ్వరుడి నైవేద్యంగా పూజలందుకున్న లడ్డును పంచర్ షాప్ మస్తాన్, అరుణ లు రూ 75000/- లకు వేలం పాట లో దక్కించుకున్నారు. అనంతరం ఫైర్ ఇంజన్ సహాయం తో 31 అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని అదే ప్రదేశం లో నిమజ్జనం చేసారు.
ఈ వినాయక చవితి ఉత్సవాలు ఇంత ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన, రేణిగుంట ప్రజలకు, జి . యమ్ వీధి వారికి, దాతలకు, అధికారులకు, రాజకీయ నాయకులకు, మరి ముఖ్యముగా మా శ్రీ అభయ వినాయక సభ్యులందరికి అధ్యక్షులు లక్ష్మణ్, ముఖ్య సలహాదారులు డి . జూలియన్ రాజు, కమిటీ సభ్యులు సుమన్, కళ్యాణ్, పవన్ మురళి, ప్రభు హేమాద్రి, సుబ్బు, వినోద్ లు ప్రత్యేక కృతజ్ఞతలు
తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *