విశాఖపట్నం మన ధ్యాస ప్రతినిధి సెప్టెంబర్ 18:ఆంధ్ర విశ్వవిద్యాలయం వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియంలో నవ్యంధ్ర జర్నలిస్ట్స్ సంఘం,భారతీయ శ్రమజీవి పత్రకార్ సంఘ్ అఖిల భారత పాత్రికేయ సదస్సు అత్యంత ఘనంగా జరిగింది.సమాజ పురోగతిలో పాత్రికేయుల పాత్రపై విస్తృతంగా చర్చించిన ఈ వేడుకకు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.​ఈ సదస్సు వేదికగా సీనియర్ పాత్రికేయులు వి డిజిటల్’ బ్యూరో చీఫ్ ఎం.ఎస్.ఆర్. ప్రసాద్ సమాజ శ్రేయస్సుకు,తోటి జర్నలిస్టుల సంక్షేమానికి అందిస్తున్న నిరంతర సేవలను చేస్తున్నారని తెలిపారు.ఆయనను సాలువతో ఘనంగా సత్కరించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన సుమారు 150 మంది జర్నలిస్టుల సమక్షంలో కార్యక్రమ నిర్వాహకులు,అసోసియేషన్ అధ్యక్షులు విశాఖ సమాచారం సంపాదకులు సూరంపూడి వీరభద్రరావు, మాజీ పార్లమెంట్ సభ్యులు జి.వి.ఎల్.నరసింహారావు మరియు ఇతర ప్రముఖుల చేతుల మీదుగా ఆయనను ఆత్మీయంగా సన్మానించారు.​సమాజంలో పాత్రికేయుల బాధ్యతను,వారి సేవలను చాటిచెప్పిన ఈ కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి డాక్టర్ జి.ఎస్.ఎన్.రాజు,సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ఇవటూరి కాశ్యప్,న్యాయవాది టి.వి.ఎస్.కె.కనకరాజుతో పాటు పలువురు మేధావులు,ప్రముఖులు విశిష్ట అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *