రేణిగుంట సెప్టెంబర్ 4.

​తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని దిగువ మల్లవరం గ్రామం సమీపంలో 04-09-2026 తేదీన ఉదయం 9:00 గంటల సమయంలో హైవే పక్కన ఒక గుర్తుతెలియని మగ వ్యక్తి స్పృహలేకుండా పడి ఉండటాన్ని గమనించిన హైవే అంబులెన్స్ సిబ్బంది అతడిని చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సదరు వ్యక్తి మధ్యాహ్నం 3:00 గంటలకు మరణించారు. మృతుడి వయస్సు సుమారు 45 నుండి 50 సంవత్సరాలు ఉంటుందని, శరీరంపై ఎటువంటి గాయాలు లేవని అధికారులు తెలిపారు. చూసేందుకు యాచక వృత్తి చేసుకునే వ్యక్తిలా కనిపిస్తున్న సదరు వ్యక్తి అనారోగ్యం కారణంగానే మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. కావున ఈ వ్యక్తి యొక్క వివరాలు లేదా ఆచూకీ తెలిసిన వారు వెంటనే రేణిగుంట పోలీస్ స్టేషన్ అధికారులను సంప్రదించాల్సిందిగా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *