తిరుపతి సెప్టెంబర్ 4.
తిరుపతి రూరల్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అమిలినేని మధు నూతన గృహ ప్రవేశ మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది.ఈ శుభ కార్యక్రమానికి తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, నూతన గృహాన్ని సందర్శించారు.గృహ ప్రవేశం సందర్భంగా అమిలినేని మధు దంపతులకు డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.నూతన గృహంలో అడుగుపెట్టిన ఆ కుటుంబానికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలగాలని, భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలువురు ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమిలినేని మధు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

