సీతారాంపురం, సెప్టెంబర్ 02, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.
మాట ఇస్తే తప్పని నాయకుడు… అభివృద్ధిని చేతల్లో చూపిస్తున్న మన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ కి హృదయపూర్వక ధన్యవాదాలు. తెలిపిన టీడీపీ యువ నాయకులు గోదా సుందర్ రెడ్డి,ఉదయగిరి నియోజకవర్గ చరిత్రలో సరికొత్త అభివృద్ధి అధ్యాయానికి శ్రీకారం చుడుతున్న సందర్భంగా, మెట్ట ప్రాంత పేద ప్రజల కష్టాలను గుర్తించి కీలకమైన అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్న ఎమ్మెల్యే కి ప్రత్యేక కృతజ్ఞతలు.ఉదయగిరి డయాలసిస్ కేంద్రం మంజూరు,డయాలసిస్ కోసం నెల్లూరు, ఆత్మకూరు, వింజమూరు వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పేద రోగులకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగకరం. తొలిదశలో 5 అత్యాధునిక డయాలసిస్ యంత్రాలతో కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం అని ఆయన అన్నారు.రహదారుల అభివృద్ధి,ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రోడ్ల సమస్యలకు పరిష్కారం చూపిస్తూ, నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు అన్నారు. సురక్షితమైన తాగునీటికి ప్రాధాన్యతప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు వాటర్ ప్లాంట్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయం. మాటల ప్రభుత్వం కాడదు చేతల నాయకత్వం,ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలంటే,ప్రజా సంక్షేమం, అభివృద్ధి, బలమైన నాయకత్వంతో మన కాకర్ల సురేష్ నాయకత్వం కొనసాగాలి. అని ఆయన గోదా సుందర్ రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *