చిత్తూరు, ఆగస్టు 29 మన ద్యాస (అనంత కుమార్ )

చిత్తూరు జిల్లా కేంద్రంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పీసీఆర్ ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులతో ర్యాలీ నిర్వహించి ఎమ్మెస్సార్ కూడలి మీదుగా పొన్నియమ్మ వీధి వరకు అవగాహన కల్పించారు.అనంతరం కేఎస్ఆర్ హైస్కూల్‌లో నిర్వహించిన సమావేశంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేయర్ రాజేశ్వరి, తుడా చైర్మన్ కటారి హేమలత, జిల్లా డీసీఓ, అసిస్టెంట్ కమిషనర్ డా. వి. జయప్రకాశ్ నాయుడు, ఒలింపిక్ కమిటీ సభ్యుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. డా. వి.జయప్రకాశ్ నాయుడు మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక వికాసంతో పాటు మానసిక దృఢత్వం పెంపొందుతుందని, సమయపాలన ప్రాధాన్యతను విద్యార్థులు తెలుసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో వాలీబాల్ జిల్లా కార్యదర్శి సురేష్ బాబు, బాస్కెట్‌బాల్ జిల్లా కమిటీ సభ్యుడు జైప్రకాశ్, మాజీ డీఎస్‌సీఓ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *