

శ్రీధర్ వర్మ నాయకత్వంలో ఎస్వీబీసీ మరింత ప్రగతి సాధిస్తుంది: మహబూబ్ బాషా రేణిగుంట ఆగష్టు 22. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నూతన చైర్మన్గా శ్రీధర్ వర్మ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు, రేణిగుంట పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా హాజరయ్యారు. శ్రీధర్ వర్మను శాలువాతో ఘనంగా సత్కరించి, పూలమాలలు వేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా రేణిగుంట పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా మాట్లాడుతూ.. భక్తి సమాజంలో ఆధ్యాత్మిక భావజాలాన్ని, వెంకటేశ్వర స్వామి వారి మహిమలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంలో ఎస్వీబీసీ ఛానల్ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. శ్రీధర్ వర్మ నాయకత్వంలో సంస్థ మరింత ప్రగతి సాధించి, భక్తులకు మెరుగైన ఆధ్యాత్మిక కార్యక్రమాలను అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆయనకు అన్ని వేళలా తమ సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు.
ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో నాయకులు బాబు, నవీన్, జయ, చిన్నబాబు, మూర్తి, మున్నా భాయ్ తదితరులు పాల్గొన్నారు.