కుర్రకాలువ సర్వే నంబర్లు 171, 172, 174లో పద్మానగర్ వాసులకు ఇంటి స్థలాలు కేటాయించాలి.
రేణిగుంట ఆగష్టు 17.
రేణిగుంట మండలంలోని పేదలు, నిరుపేదలు, కార్మికులు, అర్హులైన లబ్ధిదారుల సమస్యలను తక్షణమే పరిష్కరించి, వారికి ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణ సహాయం, మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఐ తిరుపతి జిల్లా కార్యదర్శి పి. మురళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సీపీఐ ఆధ్వర్యంలో రేణిగుంట మండలంలోని పలు పేదల కాలనీల్లో పర్యటించిన పి. మురళి, అక్కడి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి మాట్లాడారు. రేణిగుంట మండలంలో అనేక మంది పేద కుటుంబాలు సొంత ఇళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ఇంటి స్థలం కేటాయించి, ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
కుర్రకాలువలోని సర్వే నంబర్లు 171, 172, 174లో గత ప్రభుత్వం పేదలకు కేటాయించిన జగనన్న కాలనీలో ఖాళీగా ఉన్న సుమారు 150 ప్లాట్లను గుర్తించి, పద్మానగర్‌లో నివసిస్తున్న అర్హులైన నిరుపేదలకు వెంటనే ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్ నిన్న మొన్నటిది కాదని, చాలా కాలంగా సీపీఐ అధికారులు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికే రేణిగుంటలో నలుగురు తహసీల్దార్లు మారినా పద్మానగర్ పేదల తలరాతలు మాత్రం మారలేదని విమర్శించారు.
ఇప్పటికే ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారులకు తాము వ్యతిరేకం కాదని, వారికి ప్రభుత్వం ఇళ్లు నిర్మించుకునేందుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించి,మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. అదే విధంగా పద్మానగర్‌లోని అర్హులైన పేదలకు కూడా న్యాయం చేసి ఇంటి స్థలాలు కేటాయించాలని అన్నారు.
రేణిగుంట మండలం రెవిన్యూ తాసిల్దార్ వారు పేదల దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చే బాధ్యత మాది అని పేదలకు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కేతారి రాధాకృష్ణ సిపిఐ మండల కార్యదర్శి వైయస్ మనీ ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు కార్తీకు పార్టీ నాయకులు సెల్వ బాల చంద్ర శివగామి అమ్ములు మనీ విక్రమ్ రాజేశ్వరమ్మ సాయమ్మ అశోక్ తదితరులు పాల్గొన్నారు

