కాణిపాకం ఆగస్టు 17 మన ద్యాస(నాగరాజ సరకింటి )

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకంలో సినీ హీరో సాయిదుర్గ తేజ్ స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం ఆలయ ఏఈఓ రవీంద్రబాబు ఆధ్వర్యంలో సాయి దుర్గ తేజ్‌కు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందించగా, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, ట్రస్ట్ బోర్డు సభ్యుడు శివ ప్రసాద్ స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సాయిధర్మ తేజ్‌ను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు. ఆలయ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేస్తూ దర్శన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *