రేణిగుంట ఎయిర్పోర్ట్లో మర్యాదపూర్వకంగా కలిసిన బిజెపి నేతలు.
రేణిగుంట ఆగష్టు 15. చిత్తూరు జిల్లా పర్యటనను ముగించుకుని తిరుగు ప్రయాణమైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కు రేణిగుంట విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు మంత్రివర్యులను మర్యాదపూర్వకంగా కలిసి వీడ్కోలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు ప్రేమ రెడ్డి, ఉపాధ్యక్షుడు రాజా రాయల్, పట్టణ అధ్యక్షుడు నరేష్ రాయల్, మండల ప్రధాన కార్యదర్శి పురుషోత్తం పాల్గొన్నారు. అలాగే జిల్లా యువమోర్చా ఉపాధ్యక్షుడు ఎస్.ఆర్. వేణుగోపాల్, మండల యువమోర్చా అధ్యక్షుడు బొమ్మి శ్రీకాంత్, నాయకులు భాస్కర్, హరీష్, రమణ రాయల్ తదితరులు ఈ వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
