80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సత్కరించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్.

​రేణిగుంట: తిరుపతి జిల్లా కోర్టులో విధులు నిర్వహిస్తున్న రేణిగుంట పోలీస్ స్టేషన్ కోర్టు కానిస్టేబుల్ హేమంత్, గాజులమండ్యం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ మనోహర్ రెడ్డిలు ప్రతిష్టాత్మక ‘ఉత్కృష్ట సేవా పతకాల’ను అందుకున్నారు. శనివారం తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయ మైదానంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, పోలీస్ శాఖలో ఉత్తమ విధులు నిర్వహించిన కానిస్టేబుళ్ళు హేమంత్, మనోహర్ రెడ్డిలకు ఉత్కృష్ట పతకాలను అలంకరించి అభినందనలు తెలియజేశారు.

​ఈ సందర్భంగా కానిస్టేబుళ్ళు హేమంత్, మనోహర్ రెడ్డి మాట్లాడుతూ… తమ సేవలను గుర్తించి ఈ పురస్కారాలు రావడానికి కృషి చేసిన రేణిగుంట సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐలు జయచంద్ర, మంజునాథ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *