ఏర్పేడు ఆగష్టు 15.
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మడిబాక గ్రామపంచాయతీ రాజుల కండ్రిగ ఆదర్శ పాఠశాల నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను హెడ్మాస్టర్ బాల సరస్వతి ఎంతో ఘనంగా నిర్వహించారు. ఉదయం పాఠశాల ప్రాంగణంలో హెచ్ఎం జాతీయ జెండాను ఆవిష్కరించి, వందన సమర్పణ చేశారు. అనంతరం ఉపాధ్యాయులు మరియు పిల్లలు కలసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను కొనియాడారు.ముఖ్య అతిధిగా సీనియర్ జర్నలిస్ట్ గుండ్రాజు సుకుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు దేశభక్తిని, క్రమశిక్షణను అలవర్చడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.గుండ్రాజు మురళి రాజు మాట్లాడుతూ విద్యార్థులలో క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందించడమే లక్ష్యంగా విద్యాబోధన సాగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గీతాలాపన, సాంస్కృతిక నృత్యాలు, నాటకాలు అందరిని ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సుకుమార్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరిగా విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేయడంతో స్వాతంత్ర వేడుకలు ముగిశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *