రేణిగుంట ఆగష్టు 14.

​తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పాపా నాయుడు పేటలోని ప్రసిద్ధ శ్రీ ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆవిష్కరించగా, ఈ సందర్భంగా ఆలయ అధికారులు మరియు స్థానిక నాయకులు ఆయనను ఉత్సవాలకు సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ మునిశేఖర్ తో పాటు అర్జున్ బాబు, కృష్ణప్ప మొదలి, రవి కుమార్, సీతాపతి ఆచారి, మోహన్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొనగా, నాయకులు అర్జున్ బాబు మాట్లాడుతూ, ప్రసిద్ధ ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, తిరునాళ్లు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 23.08.2026 ఆదివారం రోజున అత్యంత నిష్ఠతో నిర్వహించే పవిత్రమైన అగ్నిగుండ మహోత్సవానికి మరియు తిరునాళ్లకు ముఖ్య అతిథిగా విచ్చేయాల్సిందిగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కి ఆహ్వాన పత్రికను అందజేసి ప్రత్యేకంగా ఆహ్వానించగా, ఈ వేడుకలకు మరియు అగ్నిగుండ మహోత్సవానికి తాను తప్పకుండా విచ్చేసి స్వామివారి కృపాకటాక్షాలు పొందుతానని ఎమ్మెల్యే సంతోషంగా వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *