కొండాపురం, ఆగస్టు 14, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కొమ్మి హరిజనవాడకు చెందిన బండ్లమూడి మాధవరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు వెన్నెముకకు శస్త్రచికిత్స జరగగా, కావలి రామస్వామి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ అధినేత చెరుకూరి వెంకటాద్రి నాయుడు ఆసుపత్రిని సందర్శించి మాధవరావును పరామర్శించారు. ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొమ్మి తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు దేవినేని వెంకటసుబ్బయ్య, బూత్ ఇంచార్జిలు చెరుకూరి శేషయ్య, బండ్లమూడి శ్రీనువాసులు, నాయకులు బండ్లమూడి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
