​రేణిగుంట ఆగష్టు 14. మన దేశం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకుంటున్న శుభ తరుణంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరికీ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల మహోన్నత త్యాగాలను స్మరించుకుంటూ దేశ సమగ్రతను మరియు ఐక్యతను కాపాడుకుంటామని మనమందరం ప్రతిజ్ఞ చేయాల్సిన సమయమిదని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ‘హర్ ఘర్ తిరంగా’ మహా బైక్ ర్యాలీని అత్యంత వైభవంగా నిర్వహించగా, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ఉత్సాహవంతులైన యువతతో కలిసి ఆయన స్వయంగా ఈ భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక ఏపీ సీడ్స్ వద్ద ప్రారంభమైన ఈ భారీ ర్యాలీ చారిత్రాత్మక నాలుగు మాడ వీధుల గుండా అత్యంత ఉత్సాహభరితంగా సాగగా, వేలాది బైకులు మరియు రెపరెపలాడే త్రివర్ణ పతాకాలతో పురవీధులన్నీ మువ్వన్నెల శోభను సంతరించుకున్నాయని, నియోజకవర్గ ప్రజల్లో కనిపించిన ఈ అపారమైన దేశభక్తి మరియు ఉత్సాహం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయని వెల్లడిస్తూ, అందరూ ఐక్యంగా ముందడుగు వేయాలని ఆకాంక్షిస్తూ జై హింద్, భారత్ మాతా కీ జై అని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *