శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి లక్ష్యం.
కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేస్తోంది: టిడిపి పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా.
రేణిగుంట ఆగష్టు 9.
కూటమి ప్రభుత్వం చేపట్టిన ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం’ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు రేణిగుంట పట్టణంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆదివారం సాయంత్రం టిడిపి పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఆధ్వర్యంలో రేణిగుంట పట్టణ ప్రధాన వీధుల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా టిడిపి పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా మాట్లాడుతూ.. కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని తెలిపారు. అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అనునిత్యం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రజల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకుని, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో ఎమ్మెల్యే ప్రత్యేక ముద్ర వేశారని అన్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, యూనిట్ ఇంచార్జ్ కిరణ్, నాయకులు నాగేశ్వరరావు, ఈ. మురళి ముదిరాజ్, శివయ్య నాయుడు, నరసింహులు, గోపి యాదవ్, రమణ, మనీ, సంపత్, వేణు, బాబు, వెంకటేష్, చిన్నబాబు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


