మన ధ్యాస ,కామారెడ్డి, ( నిజాంసాగర్ ) విద్యార్థుల అభ్యున్నతితో పాటు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తూ “మనకోసం మనం” స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కిషోర్ కుమార్ చేస్తున్న సేవలు అభినందనీయమని పలువురు కొనియాడారు.
నిజాంసాగర్ మండలంలోని గడియారాలు, గ్రామంలో పాఠశాలకు గడియారాలు, అచ్చంపేట గ్రామంలోని పాఠశాలకు బెంచీలు అందించడంతో పాటు విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ చేశారు. పాఠశాలల్లో అవసరమైన మరమ్మతుల కోసం నిధులు అందిస్తూ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కిషోర్ కుమార్ కృషి చేస్తున్నారు. వీటితో పాటు విద్యా, సామాజిక రంగాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు.
విద్యార్థులు సౌకర్యవంతమైన వాతావరణంలో చదువుకునేలా పాఠశాలల అవసరాలను గుర్తించి సహాయం చేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.ఈ సేవలను గుర్తించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి కిషోర్ కుమార్‌ను ప్రశంసించారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన పీఆర్టీయూ జిల్లా సర్వసభ్య సమావేశంలో కిషోర్ కుమార్‌ను ఘనంగా సన్మానించి శాలువాతో సత్కరించారు. విద్యార్థుల అభ్యున్నతి, సామాజిక సేవలో ఆయన చేస్తున్న కృషి మరెందరికో స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిక్షం గౌడ్, రాష్ట్ర పెన్షనర్ల సంఘం అధ్యక్షులు వెంకటరెడ్డి, మాజీ పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు గుండు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కుశాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీనివాస్ రెడ్డితో పాటు వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, పీఆర్టీయూ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.