శ్రీకాళహస్తి ఆగష్టు 7.

చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకురావడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన “నేతన్నల సేవలో” పథకం కింద అర్హత పొందిన ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి ₹25,000 ఆర్థిక సాయం నిధులను విడుదల చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చేనేత కళే ప్రాణమని, రాత్రింబవళ్లు కష్టపడి నూలు వడికే నేతన్నల రుణం తీర్చుకోలేనిదని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం చేనేత కార్మికుల కష్టాలను గుర్తించి, వారి భవిష్యత్తుకు కొండంత భరోసానిస్తూ ప్రతి ఏటా రూ. 25,000 అందజేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, కూటమి ప్రభుత్వానికి శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల తరఫున, చేనేత సోదర సోదరీమణుల తరఫున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ప్రభుత్వం అందించిన ఈ ఆర్థిక సాయం నియోజకవర్గంలోని వందలాది చేనేత కుటుంబాలకు ఎంతో దోహదపడుతుందని సుధీర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి, నేతన్నల సంక్షేమానికి మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ ముందుంటానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తనకు ప్రజాసేవ చేసే అవకాశం ఇచ్చిన శ్రీకాళహస్తి ప్రజలకు, చేనేత వర్గాలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *