కంటి చూపు బాగుంటేనే విద్యాభివృద్ధి సాధ్యం.

అంబేద్కర్ గురుకులంలో 632 మందికి ఉచిత కంటి పరీక్షలు!..

శ్రీకాళహస్తి జులై 30.

కాసాగార్దేన్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గురుకుల్ బాలికల పాఠశాలలో ‘ఎస్‌వీ అరవింద్ ఐ హాస్పిటల్’ వారి సౌజన్యంతో సుమారు 632 మంది విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు.
విద్యార్థుల కంటి ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, ఈ శిబిరం నిర్వహణకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తుకు మంచి కంటి చూపు ఎంతో అవసరమని, చదువుకునే పిల్లల్లో చిన్నపాటి కంటి సమస్యలు కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించడం ఎంతో ముఖ్యమని అన్నారు.
విద్యార్థులు ఎలాంటి కంటి ఇబ్బందులు లేకుండా చదువులో రాణించాలనే ఉద్దేశంతోనే ఎస్‌వీ అరవింద్ ఐ హాస్పిటల్ వైద్య బృందాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించి “సుమారు 632” మందీ కి ఈ కంటి పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రతి విద్యార్థికి సమగ్ర కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య సూచనలు అందించారు.విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధి కోసం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *