జలదంకి జులై 27 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సూచనలతో,జలదంకి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మునగాల తిరుమల రెడ్డి ఆద్వర్యంలో సోమవారం జలదంకి మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలో ఇంటింటికి తెలుగుదేశం (డోర్ టు డోర్) కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. డోర్ టు డోర్ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తిరుమలరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని ఇంకా కూడా చేస్తుందని, దేశంలోనే నిరంతరం పని చేసే ఏకైక ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు అని తెలిపారు, ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ – సుపరిపాలనలో నడిపిస్తున్న గొప్ప నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు అని ఆయన తెలియజేశారు.ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి చేరేలా పార్టీ పలు గ్రామ నాయకులు పని చేయాలని ఆయన తెలిపారు,కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని . కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కట్టుబడి పనిచేయాలని ఆయన కోరేరు, ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానిధిని, మన ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి ప్రదంలో నడుపుతు ముందుకు తీసుకెళ్తూన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మనం అందరం కలిసికట్టుగా ముందుకు నడవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు పలు గ్రామాల అధ్యక్షులు గ్రామ కమిటీ మెంబర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.