​రేణిగుంట జులై 26.
రేణిగుంటలోని అనదానం వీధిలో నూతనంగా నిర్మించిన తమ గృహం ‘దరియావ్ వాటిక’ (హిమత్ పిఆర్‌జి హౌస్) ప్రవేశ ఆహ్వాన పత్రికను స్వీకరించిన ప్రముఖ సామాజిక వేత్త, జబ్బార్ ట్రస్ట్ అధినేత డాక్టర్ షేక్ ఫరీద్ బాబా, గృహప్రవేశ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా తల్లిదండ్రులు శ్రీమతి మైనాదేవి మరియు పుఖ్‌రాజ్ జీ గెహ్లాట్ల ఆశీస్సులతో, గెహ్లాట్ కుటుంబ సభ్యులు (హిమత్ పిఆర్‌జి గ్రూప్) నేమి చంద్ గెహ్లాట్ దంపతులకు డాక్టర్ షేక్ ఫరీద్ బాబా తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) శ్రీవారి కొండ లడ్లు, వడలను ప్రసాదంగా అందజేసి, వారికి మనస్ఫూర్తిగా ఆశీస్సులు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ షేక్ ఫరీద్ బాబా మాట్లాడుతూ… నేమి చంద్ గెహ్లాట్ భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో భవనాలను నిర్మించి, సమాజంలో మరింత ఉన్నతమైన స్థానానికి ఎదగాలని, ఇంకా ఎన్నో శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. చిన్నతనం నుండి తమ కళ్లముందే పెరిగిన నేమి చంద్ గెహ్లాట్, నేడు తన స్వయంకృషితో, పట్టుదలతో సమాజం మెచ్చే మహోన్నతమైన వ్యక్తిగా ఎదగడం ఎంతో సంతోషదాయకమని పేర్కొన్నారు. ఎల్లప్పుడూ అందరితో కలిసిమెలిసి ఉండే నిరాడంబర వ్యక్తిత్వం కలిగిన ఆయన, తన తోటి వారితో మరియు సమాజ ప్రజలతో కలిసి ఉంటూ ఒక మంచి నాయకుడిగా గుర్తింపు పొందారని అన్నారు.నేమి చంద్ గెహ్లాట్ దయార్ద్ర హృదయుడని, కులమతాలకతీతంగా సహాయం కోరి వచ్చిన ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తూ విశేష సేవలందిస్తున్నారని కొనియాడారు. తల్లిదండ్రుల ఆశీస్సులు, ప్రజల దీవెనలతోనే ఈరోజు గెహ్లాట్ కుటుంబం సమాజంలో ఎంతో గుర్తింపు పొందిందని తెలిపారు.రేణిగుంట పరిసర ప్రాంత ప్రజలు, మండల ప్రజలు, తోటి నాయకులు మరియు ప్రజాప్రతినిధులు నేమి చంద్ గెహ్లాట్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలపడం, ఆయన ఎదుగుదలను చూడడం తన మనస్సుకి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని డాక్టర్ షేక్ ఫరీద్ బాబా ఈ సందర్భంగా కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *