శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రారంభమవుతున్న “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమాన్ని ప్రతి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు.
రాబోయే 45 రోజుల పాటు ప్రతి ఇంటి గడపను తట్టి, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు పూర్తిగా వివరించాలని ఆయన కోరారు.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం–2, అన్న క్యాంటీన్లు, మెగా డీఎస్సీ, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పురోగతి వంటి పథకాలతో పాటు ప్రభుత్వం ప్రజల కోసం చేపడుతున్న ప్రతి మంచి కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు.
“ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఇంకా చాలా మందికి పూర్తిగా తెలియకపోవచ్చు.
అందుకే ప్రతి కార్యకర్త ప్రజలను నేరుగా కలిసి, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను స్పష్టంగా వివరించాలి.
ప్రజల ఆశీర్వాదంతోనే మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నేను కూడా మీతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తాను.
నాతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను.
మీ అందరి సహకారం, ఉత్సాహం, ప్రోత్సాహం ఈ కార్యక్రమానికి మరింత బలం చేకూరుస్తాయని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు
