ఐదు నెలల క్రితం పోగొట్టుకున్న బంగారు గొలుసు రికవరీ..​సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోగొట్టుకున్న సొత్తు రికవరీ…బాధితురాలికి అందజేసిన సిఐ మంజునాథరెడ్డి, ఎస్సై హరీష.

​రేణిగుంట మండలం వికలాంగుల కాలనీకి చెందిన రమీజా అనే మహిళ గత మహాశివరాత్రి పండుగ రోజున (15-02-2026) గాజులమండ్యం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు వద్ద పోగొట్టుకున్న 8 గ్రాముల బంగారు గొలుసును రికవరీ చేసి బాధితురాలికి అందజేసినట్లు రేణిగుంట రూరల్ సిఐ మ్ . మంజునాథ రెడ్డి మరియు గాజులమండ్యం ఎస్సై హరీష తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐ మంజునాథ రెడ్డి మరియు ఎస్సై హరీష్ నేతృత్వంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా పోలీస్ సిబ్బంది పీసీలు మహేంద్ర బాబు, మణిలతో కలిసి ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించగా, కింద పడిపోయిన బంగారు గొలుసును తిరుపతి ఎస్‌వీ నగర్‌కు చెందిన ఏసు బాబు అనే వ్యక్తి తీసుకున్నట్లు గుర్తించారు. సదరు వ్యక్తిని ఈ రోజు (16-07-2026) పోలీస్ స్టేషన్‌కు పిలిపించి సిఐ మంజునాథ రెడ్డి, ఎస్సై హరీష ఆధ్వర్యంలో విచారించగా, తనకు గొలుసు దొరికిన విషయాన్ని అంగీకరించి పోలీసులకు అప్పగించాడని తెలిపారు. ఈ మేరకు స్వాధీనం చేసుకున్న 8 గ్రాముల బంగారు గొలుసును బాధితురాలు రమీజాకు అప్పగించగా, ఆమె హర్షం వ్యక్తం చేస్తూ పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసింది. బాధితురాలికి న్యాయం చేయడంలో చొరవ చూపిన రేణిగుంట రూరల్ సిఐ మ్ . మంజునాథ రెడ్డి, గాజులమండ్యం ఎస్సై హరీష, సిబ్బందిని రేణిగుంట డీఎస్పీ వై . శ్రీనివాస రావు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *