దుత్తలూరు, జూలై 16 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలోని బద్వేలి వెళ్ళే జాతీయ రహదారి పక్కన మాదిగ భవనము నిర్మాణం కొరకు ఏర్పరచిన స్థలంలో జెండా కొరకు దిమ్మను కట్టి దానికి ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరించడానికి ఏర్పాటు చేసిన ఒక పైపుకు జూలై ఏడో తేదీ ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది . జెండా ఆవిష్కరించిన కొద్ది రోజులలోనే గుర్తు తెలియని వ్యక్తులు ఎంఆర్పిఎస్ జెండాను దహనం చేసిన ఘటన దుత్తలూరులో కలకలం రేపింది ఎమ్మార్పీఎస్ నాయకులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆదర్శాల కోసం జెండాను ఆవిష్కరించారు. జెండాను ఆవిష్కరించిన కొద్ది రోజులలో గుర్తుతెలియని కొందరు వ్యక్తులు ఎంఆర్పిఎస్ జెండాను కాల్చి వేయడం జరిగింది. ఎమ్మార్పీఎస్ జెండా మాదిగల ఆత్మగౌరవానికి ప్రతీక అలాంటి జెండాను కాల్చడం అంటే మాదిగల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమే అని ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వెనక ఎవరు ఉన్నారు అని వెంటనే కనుక్కోవాలి అంబేద్కర్ ఆశయాల కోసం పోరాటం చేస్తున్న మా మీద ఇలాంటి దాడులు చేస్తే సహించం దోషులను అరెస్టు చేయాలి అని ఈ ఘటనపై ఎమ్మార్పీఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులపై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏ కులానికి అయినా ఏ సంఘానికి చెందిన జండా నైనా గౌరవించాల్సిందే మాదిగల ఆత్మగౌరవాన్ని సెంటిమెంట్ ని దెబ్బతీయాలని చూసిన గుర్తుతెలియని వ్యక్తులు కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యవహరించి జెండాను దహనం చేసిన వారిపై ఇలాంటి చర్యలు మరల పునరావతం కాకుండా అధికారులు వెంటనే దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *