కలిగిరి, జూలై 16, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె..

కలిగిరి మండలం వెలగపాడు గ్రామ పంచాయతీ కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు మేదరమెట్ల సుబ్బరామ నాయుడు తల్లి మేదరమెట్ల చెంచు రత్నమ్మ ఇటీవల పరమపదించారు.ఈ సందర్భంగా నిర్వహించిన దశదినకర్మ కార్యక్రమానికి టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు హాజరై, చెంచు రత్నమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం మేదరమెట్ల సుబ్బరామ నాయుడు తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, చెంచు రత్నమ్మ మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ భగవంతుడు కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ వారికి ధైర్యం చెప్పారు.అనంతరం బొల్లినేని వెంకట రామారావు,ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు కొమ్మి లక్ష్మీ నాయుడు నాయుడు తో కలిసి సమావేశం అయ్యారు . మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఆప్యాయంగా ముచ్చటించి, పార్టీ బలోపేతం, స్థానిక రాజకీయ పరిస్థితులు మరియు ప్రజా సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమం లో టిడిపి ఉదయగిరి నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య, టిడిపి సీనియర్ నాయకులు ఊస మాల్యాద్రి, టిడిపి నాయకులు ఎల్ఐసి ప్రసాద్, కొండాపురం టిడిపి నాయకులు మణికుమార్, తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
