కావలి, జూలై 13, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు..
కావలి ఆర్డిఓ కార్యాలయంలో ఏవో గారికి జనతా వారధి కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ నాయకులు వినతి పత్రం సమర్పించారు.కొండాపురం మండలంలోని నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్లో నెలకొన్న నీటి ఎద్దడి సమస్యను తక్షణమే పరిష్కరించి, జాతీయ పశు జాతుల సంరక్షణ, అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని వినతి పత్రంలో కోరారు.అదేవిధంగా, కొండాపురం విద్యుత్ సబ్‌స్టేషన్‌ను కావలి డివిజన్ పరిధిలో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కొండాపురం మండల బీజేపీ అధ్యక్షులు జడపల్లి మహేష్ పాల్గొని వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ కుట్టుబోయిన బ్రహ్మానందం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఒంగోలు జిల్లా ఇంచార్జ్ భారత్ కుమార్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి శ్రీనాథ్ రెడ్డి, కావలి పట్టణ శాఖ అధ్యక్షులు మందా కిరణ్, రాష్ట్ర ఎస్సీ నాయకులు పరసు వెంకటేశ్వర్లు, బీజేవైఎం నాయకులు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.కావలి ఆర్డిఓ కార్యాలయంలో ఏవో కి బీజేపీ వినతి పత్రం కామధేను బ్రీడింగ్ సెంటర్ అభివృద్ధి – కొండాపురం సబ్‌స్టేషన్‌ను కావలి డివిజన్ పరిధిలో కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.