కలిగిరి జూలై 03, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల సేవలను వినియోగించుకోవాలని ఆదేశం..

కలిగిరి లో నీ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ ఎస్ ఆర్/ఎస్ ఐ ఆర్) కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని ఉదయగిరి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్వో) కె వెంకట రెడ్డి బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు), సూపర్ వైజర్లను ఆదేశించారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయగిరి రిటర్నింగ్ అధికారి కలిగిరి మండల పరిధిలో విస్తృతంగా పర్యటించారు.క్షేత్రస్థాయిలో జరుగుతున్న గణన పత్రాల పంపిణీ (గణన ఫారమ్ పంపిణీ) (గణన రూపం డిజిటలైజేషన్)మరియు వాటి కంప్యూటరీకరణ ( ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ, ఎస్ ఐ ఆర్ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా మరియు వేగంగా పూర్తి చేసేందుకు వీలుగా స్థానిక అంగన్‌వాడీ కార్యకర్తలను మరియు ఆశా (ASHA) వర్కర్లను కూడా పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.బీఎల్ఓలు ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫారాలు అందేలా చూడాలని, వివరాల సేకరణ మరియు డిజిటలైజేషన్ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఎస్.ఐ.ఆర్ విధులలో ఎలాంటి అలసత్వం, నిర్లక్ష్యం వహించినా సంబంధిత సిబ్బందిపై శాఖాపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.ఈ క్షేత్రస్థాయి పర్యటన మరియు పరిశీలన కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి రిటర్నింగ్ అధికారితో పాటు కలిగిరి తహశీల్దారు మొలతాటి గిరీష్, రెవెన్యూ కార్యాలయపు సిబ్బంది, సూపర్ వైజర్లు మరియు బీఎల్ఓలు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *