కలిగిరి జూన్ 20 మన న్యూస ప్రతినిధి నాగరాజు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించిన ఈ బుడ్డోడు చిన్నవయసులోనే పలువురు అధికారుల ప్రశంసలు అందుకున్నాడు. కలిగిరి మండలం వేర్నకొల్లు గ్రామానికి చెందిన మహమ్మద్ సమీర్ అనే ఈ విద్యార్థి కలిగిరి మండలంలోని బొమ్మరాజు చెరువు ఈస్ట్ స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాడు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన యేగంద్రా కార్యక్రమంలో టెలిఫిలిం లో నటించే ఛాన్స్ దొరికింది. ఈ కార్యక్రమంలో ఈ విద్యార్థి అద్భుతమైన నటన యోగాoధ్రాలో కురుక్షేత్ర ఘట్టానీ టెలిఫిలింలో కనపరిచి పలువురు వద్ద ప్రశంసలు అందుకున్నాడు. ఈ బుడ్డోడికి గురువు కూడా కలిగిరి మండలంలోని ఎరుకల రెడ్డి పాలెం గ్రామం కి చెందిన కోట అనిల్ కుమార్ రెడ్డి వద్ద శిక్షణ తీసుకోవడం జరిగింది. తద్వారా యోగ షార్ట్ ఫిలిం ద్వారా రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. వీరి ఇరువురిని మండల అధికారులు అభినందించారు. అయితే మహమ్మద్ సమీర్ కలిగిరి ఎంపీడీవో కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న మహమ్మద్ రఫీ కుమారుడు. రఫీ తన కుమారుడు సమీర్ యోగాంద్ర కార్యక్రమంలో అద్భుతంగా నటన ప్రదర్శించిన సందర్భంగా సంతోష వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *