తిరుపతి జూన్ 11.
కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన “2 సంవత్సరాల సంకల్పం, అభివృద్ధి, సంక్షేమం” బహిరంగ సభ ఏర్పాట్లను ఏర్పాటు చేస్తుంది.తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి తిరుపతి పార్లమెంట్ కో ఆర్డినేటర్ దామచర్ల సత్య, పార్లమెంట్ అధ్యక్షులు పనబాక లక్ష్మి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, కూటమి ప్రముఖ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.భారీ సంఖ్యలో తరలిరానున్న ప్రజలకు, మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్యాలరీలు, జర్మన్ షెడ్లు, మరియు పటిష్టమైన వేదిక ఏర్పాట్లను పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోవింద రావు, గ్రీనరీ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, పూతలపట్టు ఎమ్మెల్యే మురళి మోహన్,కూటమి ముఖ్య నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.


