ఏర్పేడు జూన్ 11.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు (శుక్రవారం) తిరుపతి సమీపంలోని దామినేడులో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశానుసారం నిర్వహించే ఈ “ఎన్డీయే ప్రభుత్వ సంక్షేమ” విజయోత్సవ సభను జయప్రదం చేయాలని ఏర్పేడు మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు పేరం నాగరాజ నాయుడు పిలుపునిచ్చారు.

​రేపు అనగా 12-06-2026 (శుక్రవారం) ఉదయం 10:00 గంటలకు తిరుపతి సమీపంలోని దామినేడు నందు ఈ భారీ బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఈ సభకు ముఖ్యఅతిథులుగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ విచ్చేసి పాలుగుననున్నారు.

​ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడంలోనూ, రాష్ట్ర అభివృద్ధిలోనూ, శాంతి భద్రతల పరిరక్షణలోనూ సుపరిపాలన సాగిస్తూ, రెండేండ్లు ప్రజారంజకమైన పాలన పూర్తి చేసుకుంది. ఈ విజయవంతమైన సుపరిపాలన ముగిసిన సందర్భంగా దామినేడులో జరిగే ఈ “ఎన్డీయే కూటమి సంక్షేమ” భారీ బహిరంగ సభకు ఏర్పేడు మండలం నుండి వేలాది సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు తరలివచ్చి విజయవంతం చేయాలని పేరం నాగరాజ నాయుడు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *