ఏర్పేడు జూన్ 9.
తిరుపతి జిల్లా, ఏర్పేడు మండలం, వికృతమాల గ్రామంలో మంగళవారం మారెమ్మతల్లి జాతర వైభవంగా జరిగింది. ఈ వేడుకకు అంబేడ్కర్ బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ స్టార్ కృష్ణ ను వికృతమాల గ్రామస్తులు ఆహ్వానించి శాలువాతో ఘనంగా సత్కరించి గౌరవించారు. మారెమ్మతల్లి దర్శనానంతరం స్టార్ కృష్ణ గ్రామస్తులతో కలసి బాబాసాహెబ్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వెంకటాద్రి, రామ్మూర్తి, చలపతి,శ్రీనివాసులు, చెంగల రాయలు, మణి,రామచంద్ర,శివకోటి మరియు గిరి తదితరులు పాల్గొన్నారు.

