మన ధ్యాస ప్రతినిధి పాచిపెంట మే 28 :-

  మహిళల భద్రత కోసం నాడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు నుండి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరకు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ,మరియు పాంచాలి సర్పంచ్ గుడెపు యుగంధర్ అన్నారు. మండలంలో గల పి.కోనవలస సమీపంలో గల పామాయిల్ తోటలో గురువారం మహానాడు కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించి జై ఎన్టీఆర్ జై జై చంద్రన్న జై జై లోకేష్ బాబు, జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసి ర్యాలీ నిర్వహించారు.మహిళా అభ్యుదయానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని అన్నారు. ఈ కార్యక్రమానికి మండలంలో గల అధిక మంది మహిళలు యువకులు పార్టీ కార్య కర్తలు అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు . ఎల్ఈడి టీవీ లో వర్చువల్ ప్రసంగం వింటూనే మధ్య మధ్యలో కార్యకర్తలను ఉద్దేశించి అన్ని పంచాయితీల నుంచి నాయకులు మాట్లాడారు. మాట్లాడారు. రానున్న స్థానిక ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అన్ని పంచాయతీలలో విజయకేతనం ఎగరవేయాలని పిలుపునిచ్చారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథలో నడిపిస్తున్నారని. అన్నారు. గతంలో ఎమ్మెల్యే అని కలవాలంటే రోజులు తరబడి నిరీక్షించేవారు అని నేడు మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకొని అనునిత్యం ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయడం ప్రశంసనీయమని మండల పార్టీ అధ్యక్షులు యుగంధర్ అన్నారు. పార్టీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వానికి వెన్నుముక లాంటి వారిని ఆ నమ్మకాన్ని స్థానిక ఎన్నికలలో చూపించాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *