ఆదాని_ అంబానీ కోసమే గ్యాస్ ధర పెంపు..
రేణిగుంట ఉత్తెజిత మే 4.
రేణిగుంట అంబేద్కర్ విగ్రహం వద్ద గ్యాస్ సిలిండర్ తో వామపక్షాలు నిరసన ధర్నా..

ఆదాని అంబానీ ఆదాయం కోసమే కేంద్ర బిజెపి ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను పెంచిందని ఇది వినియోగదారులపై పెనుబారంగా పడుతుందని సిపిఎం పార్టీ రేణిగుంట ప్రాంతీయ కమిటీ కన్వీనర్ కొండ్రెడ్డి హరినాథ్ తెలిపారు. సోమవారం నాడు రేణిగుంట అంబేద్కర్ విగ్రహం వద్ద గ్యాస్ సిలిండర్ తో వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ కలిసి నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీ నేతలు భాను, సెల్వరాజ్, రాజశేఖర్, హరినాథ్ మాట్లాడుతూ..
కమర్షియల్ గ్యాస్ 19 కిలోల సిలిండర్ ధర 993 రూ. పెంచడం ద్వారా ఒక్కసారిగా 3,073 రూపాయలకు పెరగడం అంటే? ఈ భారం టీ స్టాల్, టిఫిన్ సెంటర్, హోటల్స్, రెస్టారెంట్ కు వచ్చే వినియోగదారులు అయిన ప్రజలపై ఈ భారం పడబోతున్నదని వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ పార్టీలు ప్రజలను హెచ్చరించారు. ఐదు రాష్ట్రాలు ఎన్నికలు కారణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడానికి మోడీ ప్రభుత్వం భయపడిందని.. ఎలక్షన్ పూర్తయి మే 4న ఫలితాలు రాకముందే పరోక్షంగా కమర్షియల్ గ్యాస్ ధర రికార్డ్ స్థాయిలో పెంచడం బిజెపి పాలన దుర్మార్గం అన్నారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కె .ఈశ్వరమ్మ మాట్లాడుతూ.. కమర్షియల్ గ్యాస్ పెంచిన విధంగానే ఇక పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెంచి.. కార్పొరేట్ సంస్థలు ఆదానీ, అంబానీ ఆదాయాన్ని పెంచడానికి కేంద్ర బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ సిద్ధం అయిందని ఈ భారాలను మహిళలు, వ్యాపారస్తులు వ్యతిరేకించాలని ఐద్వా మహిళా సంఘం ద్వారా రేణిగుంట ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం పార్టీ ప్రాంతీయ కమిటీ కన్వీనర్ కొండ్రెడ్డి హరినాథ్, సెల్వరాజ్, వెంకటరమణ, రాజశేఖర్, చీరలయ్య, దస్తగిరి, గురుమూర్తి, ఆనంద్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, సిపిఐ పార్టీ నాయకులు భాను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *