జలదంకి, మన న్యూస్, జనవరి 25,(నాగరాజు కె ).
జలదంకి మండలంలో ప్రజా సేవకు చిరునామాగా నిలిచిన కావలి మాజీ శాసనసభ్యులు గొట్టిపాటి కొండప నాయుడు 24వ వర్ధంతి నేడు భావోద్వేగాల మధ్య సోమశిల ప్రాజెక్టు వైస్ చైర్మన్ పులిగుంట మధుమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జలదంకి పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నివాళులు అర్పించారు. పదవులు కాదు.. ప్రజల పట్ల ఉన్న బాధ్యత ఆయనకు ఆయుధం ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలబడి పేదల గొంతుకగా పోరాడిన నాయకుడిగా దివంగత నేత కొండపనాయు ని గుర్తు చేసుకున్నారు. నిడంబర జీవితం, సేవా భావన, గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ఆయన సాగించిన పోరాటం నేటికీ అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని పులిగుంట మధుమోహన్ రెడ్డి తెలిపారు. వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఆయన కలలు కన్నా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళులు అని సూచించారు.
