రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం ఎమ్మెల్యే కాకర్ల సురేష్
సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ద్వారా రెండు విడతల్లో రూ,14,000 జమ.*విత్తనాలు,ఎరువుల సరఫరాలో ముందంజలో ప్రభుత్వం:ఎమ్మెల్యే కాకర్ల సురేష్
జలదంకి, మన ధ్యాసన్యూస్, డిసెంబర్ 3, (నాగరాజు కె):

వింజమూరు సబ్‌డివిజన్ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో నిర్వహించిన “రైతన్నా! మీకోసం”కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపడుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలను గ్రామస్థులకు తెలియజేస్తూ,మన రాష్ట్రం ఆర్థిక పరంగా వెనుకబడిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, రైతులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని మన రైతు ప్రభుత్వం నిబద్ధతతో అమలు చేస్తోందని అన్నారు.ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతూ, రైతులకు ప్రత్యక్షంగా లాభం చేకూరుస్తున్నాయని వివరించారు.రైతుల ఆర్థిక భారం తగ్గించేందుకు “అన్నదాత సుఖీభవ పథకం-పీఎం కిసాన్” ద్వారా ఇప్పటికే రెండు విడతలుగా రూ.14,000 నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం ప్రభుత్వం చేసిన కీలక నిర్ణయమని చెప్పారు.ఈ ఆర్థిక సహాయం రైతుల సాగు పనులకు ఎంతో ఉపశమనం కలిగించిందని ఆయన పేర్కొన్నారు.ఇక రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు తదితర అవసరమైన సాగు సరఫరాలను ప్రభుత్వం సమయానికి అందిస్తూ, రైతుల పంట ఉత్పాదకతను పెంచేందుకు అన్ని విధాలా సహాయకర్యక్రమాలు చేపడుతోందని చెప్పారు.రైతు కుటుంబాలను బలోపేతం చేయడం,గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవితం చేయడం లక్ష్యంగా మన కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, భవిష్యత్తులో కూడా రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కూటమి మండల నాయకులు, కార్యకర్తలు, అధికారులు, రైతులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు










