కనిగిరి నవంబర్ 15 మన ధ్యాస న్యూస్ ప్రతినిధి ://

కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలో వెలసి ఉన్న హరిహరపుత్ర శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో శనివారం కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, పామూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి ప్రతి సంవత్సరం నవంబర్ 15వ తేదీ నుండి జనవరి 15వ తేదీ వరకు ఉచిత అన్నదాన కార్యక్రమం అయ్యప్ప స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న సందర్భంగా పామూరు మాజీ సర్పంచ్ కావిటి వెంకటసుబ్బయ్య, ధర్మపత్ని శ్రీమతి విజయలక్ష్మి, మోపాడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుర్రం వెంకటేశ్వర్లు ధర్మపత్ని శ్రీమతి ప్రమీల వారి ఆర్థిక సహాయంతో అన్నదాన కార్యక్రమాన్ని అయ్యప్ప మాల భక్తులకు, ఆంజనేయ స్వామి మాల భక్తులకు, భవాని మాల భక్తులకు, వెంకటేశ్వర స్వామి మాల భక్తులకు అన్నదాన కార్యక్రమం బైరెడ్డి, దారపనేని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి దేవస్థానం చైర్మన్లు గుత్తి వెంకటరాజ, కావిటి వెంకటసుబ్బయ్యలు, రాచూరి సురేష్, ఓగూరి నరసింహారావు, రోశయ్య స్వామి, గోగినేని వెంకటేశ్వర్లు, తిరివీధి హజరత్, దారపనేని నరసింహనాయుడు, యరశింగు రాయుడు, కావిటి నాగేశ్వరరావు దంపతులు, జాజం హరికృష్ణ, అయ్యప్ప స్వామి భక్తులు భారీ సంఖ్యలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *