మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) దళారులను నమ్మి కష్టపడి పండించిన రైతులు మోసపోవద్దని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. మొహమ్మద్ నగర్ మండలంలోని కొమలంచ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కొబ్బరికాయలు కొట్టి పూజ చేసి వడ్ల బస్తాను కటపై పెట్టి కొనుగోలును ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే రైతులు ధాన్యాన్ని విక్రయించాలని దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు. దళారులను నమ్మి రైతులు మోసపోయారని గుర్తు చేశారు. రైతులు పండిస్తున్న సన్న రకం దాన్యంకు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి రేషన్ కార్డులు, సన్న బియ్యం,
ఉచిత బస్సు,ఉచిత విద్యుత్, రకరకాల సంక్షేమ పథకాల ద్వారా అమలు జరుగుతున్నాయి అన్నారు. ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ ,మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి,జిల్లా ఎస్టి ఉపాధ్యక్షులు లోక్య నాయక్,తహసీల్దార్ లత,ఎంపిడివో సత్యనారాయణ,ఐకెపి ఎపిఎం ప్రసన్న రాణి,నాయకులు ఆకాష్, నాగభూషణం గౌడ్,ఖాళీక్,ఇఫ్తేకార్,ఏఈఓ మధు, ఐకెపి విఓఏ తదితరులు ఉన్నారు.








