బోగోలు ఆగస్టు 17 మనన్యూస్ ప్రతినిధి :////
బోగోలు మండల కేంద్రంలో దళిత నాయకులు బత్తల రవిచంద్ర ఆధ్వర్యంలో దళితుల ఆత్మగౌరవ సమావేశాన్ని ఆదివారం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన సీనియర్ దళిత నాయకులు, జేఏసీ వ్యవస్థాపకులు సోమశేఖర్, భారత్ మహాసేన అధ్యక్షులు జువ్విగుంట బాబు,జిల్లా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కమిటీ మాజీ సభ్యులు కొప్పాల రఘు, కావలి సీనియర్ నాయకులు సాల్మన్, ఉపాధి పనుల నిజనిర్ధారణ కమిటీ జిల్లా సభ్యులు దుడ్డు రమేష్ బాబు,తెల్లగుంట గ్రామ నాయకులు కొప్పాల శ్రీహరి పాల్గొన్నారు. అనంతరం బోగోలు మండల కేంద్రంలో నెలకొని ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ మేరకు జిల్లా జేఏసీ వ్యవస్థాపకులు సోమశేఖర్ మాట్లాడుతూ తెల్లగుంట గ్రామంలో దళితుల మీద జరిగిన దాడులను ఖండిస్తూ అన్ని ప్రజా సంఘాల నేతలతో దళితుల ఆత్మగౌరవ సమావేశాన్ని ఏర్పాటు చేయడమైనది తెలిపారు. జోరు వర్షంలో కూడా అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.అదేవిధంగా భారత్ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షులు జువ్విగుంట బాబు మాట్లాడుతూ బోగోలు మండల పరిధిలోని తెల్లగుంట గ్రామంలో ఎస్సీ మాల కులస్తులపై జరిగిన దాడి మరో చుండూరు, కారంచేడును తలపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో మొత్తం తొమ్మిది లక్షల పైగా ఎస్సీలు, రెండు లక్షల పైగా ఎస్టీలు ఓటర్లు ఉన్న ఈ ప్రాంతానికి దళిత ప్రజా ప్రతినిధి లేకపోవడమే ఈ దాడులకు కారణాలు అని తెలిపారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన జే ఏ సి ఏర్పాటు చేస్తామని తెలియజేశారు.