

మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ )
గణేష్ మండపాల వద్ద తప్పనిసరిగా నిఘా ఏర్పాటు చేయాలని ఎస్ ఐ శివకుమార్ సూచించారు.శనివారం నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గేటు వద్ద ఫంక్షన్ హాల్ లో గణేశ్ మండపాల నిర్వాహకులు,డీజే నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ ఐ శివకుమార్ మాట్లాడుతూ..అసాంఘిక కార్యకలాపాలకు చోటు ఇవ్వకూడదన్నారు.మద్యం సేవించి మండపాల వద్ద తిరగరాదని హెచ్చరించారు.అలాగే డీజేలు, లౌడ్ స్పీకర్లు ఉపయోగించే విషయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శోభాయాత్రల సమయంలో విద్యుత్ సరఫరా,భద్రతా చర్యలు,అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు.
సమావేశంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన గణేశ్ మండప నిర్వాహకులు, డీజే నిర్వాహకులు పాల్గొన్నారు.