మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:మాజీ ముఖ్యమంత్రి,వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో నియోజకవర్గ వైసిపి కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పిలుపు మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద సోమవారం యువత పోరు నిరసన ర్యాలీకి రాష్ట్ర వైసిపి యువజన కార్యదర్శి,నగర పంచాయతీ కౌన్సిలర్ బదిరెడ్డి గోవింద్ బాబు ఆద్వర్యంలో పార్టీ శ్రేణులు కాకినాడ తరలి వెళ్ళారు.ఈ సందర్భంగా గోవింద్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు.నెలకు నిరుద్యోగ భృతి ఇస్తామని కూటమి ప్రభుత్వం యువతకు హామీ ఇచ్చిందని,ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాల భర్తీ చేపడతామని తెలిపి ఏడాది పాలన పూర్తయినా సరే హామీలు అమలు చేయకపోవడంపై రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కాకినాడలో కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టనున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జువ్విన వీర్రాజు,జువ్విన వీర్రాఘవమ్మ,శిడగం రాజేశ్వరరావు,ఈపి రాము,ఎద్దు నవీన్,పతివాడ జగదీశ్వరరావు,శేశెట్టి శ్రీను,లోగీసు శేఖర్,మామిడాల బాబ్జి,బాదం సురేష్,భీశెట్టి రాజా,దత్తి రాజా,జువ్విన శివ,గోనుపూడి కొండబాబు,కసిరెడ్డి రామకృష్ణ,పోతల ముత్యాల రాజు,అల్లం ఆదినారాయణ,పట్టా సుబ్బారావు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు,అభిమానులు,నాయకులు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *