మన న్యూస్ ,నెల్లూరు: మరో రెండేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. అమరావతికి 30 వేల ఎకరాలు కావాలని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పిన జగన్.. అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అంటూ కొత్త డ్రామాకు తెరలైపోయారని మండిపడ్డారు. అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతూ ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయిన వైసిపి.. దానిపై దుష్ప్రచారానికి దిగుతుందన్నారు. అల్లిపురం డంపింగ్ యార్డ్ లో లెగిసి వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ వద్ద పనులను పరిశీలించిన నారాయణ అధికారులకు పలు సూచనలు చేశారు. రీసైక్లింగ్ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. గత వైసిపి ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తను వదిలేసి వెళ్లిపోయిందని.. 50% చెత్తను రీసైక్లింగ్ చేశామని మంత్రి వెల్లడించారు. అక్టోబర్ రెండు నాటికి ఏపీని చెత్త రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని వివరించారు. మహిళలంటే వైసీపీకి గౌరవం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి మహిళను వేశలంటూ కించపరిచారని మండిపడ్డారు. అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందని 50 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామని వివరించారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ తో పాటు.. నగర అధ్యక్షుడు మామిడాల మధు..జిల్లా అధికార ప్రతినిధి కువ్వారపు బాలాజి,పాకాలపెంచలయ్య,బాబురావు,నాగేశ్వరరావు,సురేష్,సుబ్బలక్ష్మి,మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *