శంఖవరం మన న్యూస్ (అపురూప్) మీడియాపై దాడులను ఖండిస్తూ పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలని కోరుతూ శంఖవరం ప్రెస్ క్లబ్ సభ్యులు శుక్రవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానిక తహ సీల్దార్ కార్యాలయం యం వద్ద శాంతియుతంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్లు కేళంగి హరి నాథ్, రేలంగి దొరబాబు, జక్కల సత్యనారా యణ, బొట్ల లోవరాజు మాట్లాడుతూ, సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో పోలీసులు అక్రమంగా సోదాలు చేయడం దారు ణమన్నారు. పాత్రికేయులపై దాడులను తీవ్రంగా ఖండించారు.అనంతరం తహసీల్దార్ తాతారా వుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు యండమూరి బాబి,, బైరా రామారావు, నక్కా శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *